నాటుసారా స్థావరాలపై దాడులు | Sakshi
Sakshi News home page

నాటుసారా స్థావరాలపై దాడులు

Published Sun, May 5 2024 3:30 AM

నాటుసారా స్థావరాలపై దాడులు

రెబ్బెన: జిల్లా ఎకై ్సజ్‌ అధికారి జ్యోతికిరణ్‌ ఆదేశాల మేరకు శనివారం రెబ్బెన మండలంలోని ఎన్టీఆర్‌ కాలనీ, దేవులగూడతో పాటు అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఎకై ్సజ్‌ సీఐ దీపక్‌ తెలిపారు. ఎన్టీఆర్‌ కాలనీలో 950 లీటర్లు, దేవులగూడలో 850 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ కాలనీలో నాటుసారా తయారు చేస్తున్న ఇస్లావత్‌ సుజాత వద్ద 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేశ్‌కుమార్‌, కానిస్టేబుళ్లు సురేష్‌, రజిత, ధను, తదితరులు పాల్గొన్నారు.

వినియోగదారులకు నాణ్యమైన సేవలు

చింతలమానెపల్లి/కాగజ్‌నగర్‌రూరల్‌: విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నామని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ వరంగల్‌ జనరల్‌ మేనేజర్‌ గౌతమ్‌రెడ్డి అన్నారు. శనివారం ఈజ్‌గాంలోని 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. కౌటాల, దహెగాం, కాగజ్‌నగర్‌, గన్నారం ఫీడర్లలో ఇబ్బందులు, లోడ్‌ సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ సరఫరాలో సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా సేవలందిస్తున్న సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట డీఈ నాగరాజు, రూరల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ జగన్‌మోహన్‌, సిబ్బంది ఉన్నారు.

వడదెబ్బతో మహిళ మృతి

రెబ్బెన(ఆసిఫాబాద్‌): మండల కేంద్రానికి చెందిన అజీజబేగం (48) శనివారం వడదెబ్బతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగించే మహిళ రోజు మాదిరిగానే శుక్రవారం పనులు ము గించుకుని మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. కాసేపటికి వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స అందించారు. శనివారం మరోసారి పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స అందించినప్పటికీ సాయంత్రం మృతి చెందింది.

విధి నిర్వహణలో భద్రత సూత్రాలు పాటించాలి

వాంకిడి: విద్యుత్‌ శాఖ సిబ్బంది విధి నిర్వహణలో భద్రత సూత్రాలు పాటించాలని వి ద్యుత్‌ శాఖ ఎస్‌ఈ వాసుదేవ్‌ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని 33/11 కేవి విద్యుత్‌ ఉప కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సేవలు అందించాలన్నారు. భద్రత నియమాలతో ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు.

Advertisement
 
Advertisement