● కాంగ్రెస్‌ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు | Sakshi
Sakshi News home page

● కాంగ్రెస్‌ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు

Published Mon, May 6 2024 6:35 AM

● కాం

రాహుల్‌ను ప్రధానిని చేద్దాం

రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్‌ స్థానాలు గెలిపించి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికి మనవంతు కృషిచేద్దాం. బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్‌ రాసిన భారత రాజ్యాంగాన్ని తొలగించి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని అనుకుంటోంది. అందరి హక్కులు కాపాడేది రాజ్యాంగమే. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపించమంటే అయోధ్య నిర్మాణాన్ని చూపిస్తోంది. ఎందరో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన రాహుల్‌గాంధీకే సొంత ఇల్లు లేదు. ఇలా పేదలకు దగ్గరగా ఉండే నాయకుడినే గెలిపిద్దాం. – సీతక్క, జిల్లా ఇన్‌చార్జి మంత్రి

కొంగుచాచి అడుగుతున్న..

దేశ భవిష్యత్‌ కోసం కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి. కొంగు చాచి అడుగుతున్న. నాకు ఓటేసి గెలిపించాలని కోరుతున్న. ప్రతీఒక్కరు ఓటేసి కాంగ్రెస్‌ను గెలిపించాలి. రాహుల్‌గాంధీని ప్రధానిని చేద్దాం. ఒక గిరిజన బిడ్డను గుర్తించి కాంగ్రెస్‌ అధినాయకత్వం పార్లమెంట్‌ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. జీవితంలో కాంగ్రెస్‌ను మరిచిపోలేను. కాంగ్రెస్‌ కుటుంబాన్ని బలోపేతం చేయడానికి కష్టపడి పని చేస్తా.

– ఆత్రం సుగుణ, ఎంపీ అభ్యర్థి

నిర్మల్‌/నిర్మల్‌చైన్‌గేట్‌: తనకు ఆదిలాబాద్‌ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసని, తాను పీసీసీ అధ్యక్షుడైన తర్వాత మొదటి కార్యక్రమమే నిర్మల్‌లో చేపట్టానని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. నిర్మల్‌లోని కలెక్టరేట్‌రోడ్డులోని క్రషర్‌గ్రౌండ్‌లో ఆదివారం జనజాతర పేరిట కాంగ్రెస్‌ నిర్వహించిన పార్లమెంట్‌ ఎన్నికల సభలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతోపాటు సీఎం పాల్గొన్నారు. ఇద్దరు నేతలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు వరాలు కురిపించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఆదిలాబాద్‌ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడైన వెంటనే నిర్మల్‌లో మోదీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలపై తొలిసారి పోరాడానని గుర్తుచేశారు. ఇంద్రవెల్లిలోనూ కేసీఆర్‌ సర్కారుకు వ్యతిరేకంగా దళిత, గిరిజన దండోరా నిర్వహించి బీఆర్‌ఎస్‌పై సమరశంఖం ఊదామని పేర్కొన్నారు.

దత్తత తీసుకుని అభివృద్ధి

ఉమ్మడి ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత సీఎంగా తాను తీసుకుంటానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి 1.50లక్షల ఎకరాలకు నీరిస్తామని వాగ్దానం చేశారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐ సిమెంట్‌ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుందని చెప్పారు. తాము పదేళ్లు అధికారంలో ఉంటామని, ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేసి ఇక్కడి రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు.

తొలిసారి ఆడబిడ్డకు..

గత 70ఏళ్లలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఏ ఒక్క మహిళకు అవకాశం రాలేదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోనియాగాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఆది లాబాద్‌ నుంచి గోండు ఆడబిడ్డ ఆత్రం సుగుణను పార్లమెంట్‌కు తీసుకెళ్లాలని టికెట్‌ ఇచ్చారని చెప్పా రు. తమ అభ్యర్థి సుగుణ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి తండాలు, గూడేల్లో తిరుగుతూ ప్రజాపోరా టాలు చేశారని గుర్తు చేశారు. ప్రజాసమస్యలు తెలి సిన సుగుణను లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరా రు. కుమురంభీం, రాంజీగోండు స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ఆమెను పార్లమెంట్‌కు పంపించాలని పిలుపునిచ్చారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ఆగస్టు 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతానని హామీ ఇచ్చారు.

● కాంగ్రెస్‌ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీ
1/3

● కాంగ్రెస్‌ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీ

● కాంగ్రెస్‌ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీ
2/3

● కాంగ్రెస్‌ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీ

● కాంగ్రెస్‌ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీ
3/3

● కాంగ్రెస్‌ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీ

Advertisement
Advertisement