ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలఅర్బన్: ఉపాధ్యాయులు ఎదుర్కొంటు న్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూటీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంచిర్యాలలో ఆదివారం ఎస్‌టీయూటీఎస్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీఆర్‌సీ నివేదిక పూర్తిచేసి వెంటనే ప్రకటించాలన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ వి ధానం అమలు చేయాలని పేర్కొన్నారు. జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని సూ చించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరి ష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.
నూతన కమిటీ ఎన్నిక..
ఎస్‌టీయూటీఎస్ నూతన కమిటీని ఆదివారం ఎ న్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా హైదరాబాద్ జిల్లా కార్యదర్శి రాంసుబ్బారావు, పోల్‌రెడ్డి వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా బట్టారి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బాపు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా కరుణాకర్, అసోసియేటెడ్ అధ్యక్షుడిగా సత్తయ్య, ఉపాధ్యక్షులుగా పద్మ, మన్మోహన్, మహాలక్ష్మి, అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎం.సుమన్, జిల్లా కార్యదర్శులుగా జయ, శ్రీరామ్, మాధ వి, స్వప్నదేవి, ఆర్థిక కార్యదర్శిగా సత్యనారాయణ, ఫైనాన్స్ కమిటీ సభ్యులుగా గంగుతాయి, సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మంచి ర్యాల జిల్లా పూర్వ అధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు, పూర్వ ప్రధాన కార్యదర్శిగా శంకర్‌గౌడ్, గౌరవ అ ధ్యక్షుడు భీంరావ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment