● ఆర్డీవో శ్రీనివాసరావు
మంచిర్యాలక్రైం: ఎన్‌సీసీ ఉన్నత శిఖరాలు అధిరో హించడానికి నిచ్చెన లాంటిదని ఆర్డీవో శ్రీనివాసరా వు అన్నారు. మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఎన్‌సీసీ దినోత్సవం నిర్వహించారు. ఆర్డీవో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్‌సీసీ క్రమశిక్షణకు మారుపేరని, కృషి, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహద పడుతుందన్నారు. తాను ఇదే కళాశాలలో చదివాన ని, ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఉన్నానని గుర్తుచేసుకున్నా రు. ఎన్‌సీసీ క్యాడెట్‌లకు ఉన్నత విద్య ఉద్యోగావకా శాలలో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. ఎన్‌సీసీతో క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం పెరుగుతాయని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ చక్రపా ణి మాట్లాడుతూ మన కళాశాల విద్యార్థి 32 ఏళ్ల తర్వాత ఉన్నత అధికారి హోదాలో ఎన్‌సీసీ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎన్‌సీసీ క్యాడెట్స్ రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎంఈ వో మల్లేశ్, ఎన్‌సీసీ కేర్‌టేకర్ జాడి మహేశ్‌కుమార్, లెఫ్టినెంట్ బి.తిరుపతి, కళాశాల అధ్యాపకులు గంగయ్య, కుమార్, గోపాలకృష్ణ, రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
హాజరైన ఎన్‌సీసీ క్యాడెట్లు
మాట్లాడుతున్న ఆర్డీవో శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment