మాజీ హోంగార్డు శాంతిదీక్ష
బెల్లంపల్లి: రాష్ట్రంలో హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బెల్లంపల్లిలో మాజీ హాంగార్డు గురువారం శాంతిదీక్ష చేపట్టాడు. రడగంబాలబస్తీలోని తన ఇంటి ఆవరణలో మాజీ హాంగార్డు సకినాల నారాయణ సీఎం రేవంత్రెడ్డి విగ్రహానికి పూలమాల వేశాడు. అనంతరం ఆయన మాట్లాడారు. హోంగార్డుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ దీక్ష చేపట్టానని తెలిపారు. ఈ దీక్ష డిసెంబర్ 6వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. 6న హోంగార్డ్స్ 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు వ్యవస్థను పర్మనెంట్ చేయాలని, మృతి చెందిన హోంగార్డుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. కాగా, బెల్లంపల్లి టూటౌన్ ఎస్పై కె.మహేందర్ దీక్ష చేస్తున్న నారాయణ ఇంటి వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment