కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని ప్రజలకు కుటుంబ నియంత్రణపై వైద్యులు, సిబ్బంది అవగాహన క ల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా క్టర్ హరీశ్‌రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కుటుంబ ని యంత్రణ అవగాహన పోస్టర్లను గురువారం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మా ట్లాడుతూ వచ్చే నెల 4వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సహకారంతో కు టుంబ నియంత్రణ కార్యక్రమాలపై అవగాహన క ల్పించాలని అన్నారు. కుటుంబ నియంత్రణకు నో టిమాత్రలు, ఐయూడీ నిరోధ్ ఎమర్జెన్సీ, అంతరా ఇంజక్షన్ వంటి తాత్కాలిక పద్ధతులపై వివరించా లని తెలిపారు. కుటుంబ నియంత్రణ శిబిరాలు ఏ ర్పాటు చేయాలని, పిల్లలు కలిగిన వారిలో మగవారికి వ్యాసెక్టమీ, ఆడవారికి ట్యూబెక్టమీలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుధాకర్ నాయక్, అనిత, ప్రసాద్, కృపాబాయి, కాంతారావు, పద్మ, బుక్క వెంకటేశ్వర్, దామోదర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment