ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నెన్నెల: నిబంధనలు ఉల్లంఘించి వాగులు, వంకల నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. గురువారం మండలంలోని ఖర్జీ–జంగాల్‌పేట ఇసుక రీచ్‌ను పరి శీలించారు. ట్రాక్టర్ల పత్రాలను పరిశీలించి ఆన్‌లై న్‌లో నమోదు చేసుకున్న ప్రకారంగా తరలిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ట్రాక్టర్లను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గొల్లపల్లి, నెన్నెల గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు. గొల్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి వంటశాల, ఆహార నిల్వలు, గదులు, పరిసరాలు, రిజిష్టర్లు పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భో జనం అందించాలని, శుద్ధమైన తాగునీరు ఏర్పా టు చేయాలని తెలిపారు. తహసీల్దార్ రమేష్, ఆర్‌ఐ సులోచన, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
రైతుల ఖాతాల్లో నగదు జమ
మంచిర్యాలఅగ్రికల్చర్: ధాన్యం సేకరించిన రైతుల ఖాతాల్లో మూడు రోజుల వ్యవధిలో నగదు జమ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం కొందరు రైతులు తమ ఖాతాల్లో నగదు జమ కావడంతో కలెక్టర్ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావుతో కలిసి కలెక్టర్‌ను మార్యదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ, ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment