అంతర్రాష్ట్ర గ్యాస్ సిలిండర్ల ముఠా అరెస్ట్
● ఈ నెల 21న జైనథ్ హెచ్‌పీ గోదాంలో చోరీ ● 74 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం ● పోలీసుల అదుపులో నిందితుడు
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): అంతర్రాష్ట్ర గ్యాస్ సిలిండర్ల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఆది లాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. జైనథ్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో గురువారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌లోని పిలోడి జిల్లాకు చెందిన వికాస్ లాదూరం బిసనో యి, ప్రకాశ్ బిసనోయిలు గత తొమ్మిది నెలలుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా హాయిరీ తాలుకా ఆలపల్లిలోని గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌లుగా పనిచేస్తున్నారు. దీపావళి సందర్భంగా వికాస్ లాదూరం తన సొంత గ్రామమైన రాజస్థాన్‌కు వె ళ్లాడు. తిరుగు ప్రయాణంలో స్నేహితుడైన ప్రకాశ్ తో కలిసి మహారాష్ట్రకు వెళ్తుండగా జైనథ్‌లోని గో దాంలో దొంగతనం చేసేందుకు నిర్ణయించుకున్నారు. వీరి వద్ద గ్యాస్ డెలివరీ చేసే ట్రాలీ వా హనం ఉంది. ఈనెల 20న అర్ధరాత్రి దాటిన త ర్వాత జైనథ్ సమీపంలో హెచ్‌పీ గ్యాస్ గోదాం ప్రహరీ దూకి లోనికి వెళ్లారు. తాళం పగులగొట్టి 74 సిలిండర్లను ఎత్తుకెళ్లారు. ఈనెల 26న గోదాం మేనేజర్ సమంత్ ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్పీ రెండు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. మహారాష్ట్రతోపాటు తది తర ప్రాంతాల్లో దొంగల కోసం గాలించారు. గురువారం మధ్యాహ్నం జైనథ్ పోలీసులు దీపాయిగూడ ఎక్స్‌రోడ్ వద్ద వాహనాల తనిఖీలు చేశారు. కిన్వట్‌కు ఈ సిలిండర్లను విక్రయించేందుకు వికాస్ వెళ్తున్నాడు. అనుమానం వచ్చి పోలీసులు విచారించగా చోరీ చేసిన సిలిండర్ల ఉన్నట్లు ఒప్పుకున్నాడు. ప్రకాశ్..కిన్వట్‌లో ఈ సిలిండర్లను విక్రయించేందుకు అక్కడి వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 78 సిలిండర్లలో పది సిలిండర్లను వినియోగదారులకు విక్రయించారు. 68 సిలిండర్లు నిండుగా ఉండగా, ఖాళీగా పది సిలిండర్లు ఉన్నాయి. అదేవిధంగా సిలిండర్ విక్రయించిన రూ.10వేల నగదు వారి వద్ద ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. అయితే వికాస్‌ను అరెస్టు చేశామన్నారు. ప్రకాశ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సిలిండర్లతోపాటు నగదు, వాహనా న్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిని పట్టుకున్న జైనథ్ సీఐ సాయినాథ్, జైనథ్ ఎస్సై పురుషోత్తం, ఏఎస్సై సిరాజ్, ఆదిలాబాద్ టూటౌన్ కానిస్టేబుల్ నరేశ్‌లను డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment