అర్లి(టి)లో 8.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
● ఇది రాష్ట్రంలోనే అత్యల్పం
తాంసి: భీంపూర్ మండలంలోని అర్లి(టి)లో గురువారం 8.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత కొన్నేళ్లుగా అర్లి(టి) శివారులో రాష్ట్రంలోనే కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది కూడా రెండురోజులుగా 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం మళ్లీ చలితీవ్రతతో పాటు ఈదురుగాలులు మరింత పెరగడంతో ఉష్ణోగ్రతలు మరింత కనిష్టస్థాయికి చేరాయి. రాష్ట్రంలోనే కనిష్టంగా అర్లి(టి)లో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అర్లి(టి)తో పాటు పెన్‌గంగ నది పరీవాహక ప్రాంతం వెంట ఉన్న అంతర్గాం, వడూర్, తాంసి(కే), గోముత్రి గ్రామాల్లోనూ చలి ఎక్కువగా ఉంది. పంటచేలకు వెళ్లే రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 11 గంటల తర్వాతే పంటచేలకు వెళ్తున్నారు. రాత్రి చలిమంట వేసుకుని, ఉన్ని దుస్తులు, రక్షణ కవచాలు ధరించి ఉపశనమం పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment