ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి
లక్సెట్టిపేట: విద్యార్థులు వార్షిక పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాల కోసం కృషి చేయాలని గిరిజనా భివృద్ధి అధికారి జాదవ్ అంబాజీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బా లికల పాఠశాలను పరిశీలించి మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థులు పది జీపీఏ సాధించా లని, ఉన్నత చదువులకు వార్షిక పరీక్షల ఫలి తాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం వంటగది పరిసరాలు, భోజనం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, హెచ్డబ్ల్యూవో మల్లారెడ్డి, పీడీ జీవరత్నం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment