గోదారమ్మకు గంగాహారతి
బాసర: బాసర గోదారమ్మకు బుధవారం అర్చకులు, వేదపండితులు ఘనంగా హారతి ఇచ్చారు. ఒకటో ఘాట్ వద్ద ఆలయ వైదిక బృందం ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ముందుగా గోదారమ్మ ఉత్సవ విగ్రహానికి వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసిన అ ర్చకులు నదికి పంచహారతి ఇచ్చారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో శ్రీవాగ్దేవి వాద్య సంగీత కళానృత్య సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో చిన్నారులు కూచిపూడి, భరతనాట్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లోని శార ద నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. తెనాలిలోని శ్రీలక్ష్మి కూచి పూడి నృత్య కళాకేంద్రానికి చెందిన భావన పెదప్రోలు, వెంకటలక్ష్మి శిష్య బృందం ఆధ్వర్యంలో కూచి పూడి, భరతనాట్యం ప్రదర్శించారు. ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఆలయం తరఫున అమ్మవారి ప్రసాదం, జ్ఞాపికలు అందజేసి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment