మహారాష్ట్ర వైపునకు పెద్దపులి
వాంకిడి(ఆసిఫాబాద్): ఆదివారం నుంచి మండల ప్రజలను భయాందోళనకు గురిచేసిన పె ద్దపులి మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉద యం నుంచే పులిజాడ కోసం సిబ్బంది గాలించగా, మహారాష్ట్ర ప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించారు. బుధవారం మహారాష్ట్రలోని కోస్టాడ అడవుల్లోకి వెళ్లినట్లు నిర్ధారించారు. అక్కడే ఓ లేగదూడపై దాడి చేసినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.
కెరమెరి మండలంలో
చిరుత హల్‌చల్
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలో కొన్నిరో జులుగా పెద్దపులి సంచారం కలకలం రేపుతుండగా, తాజాగా ఓ చిరుతపులి హల్‌చల్ చేస్తోంది. మంగళవారం సాయంత్రం లచ్చునాయక్ తండాకు చెందిన సోన్‌కాంబ్డె సిద్దార్థ్ లేగదూడపై గ్రామ శివారు ప్రాంతంలో చిరుతపులి దాడి చేసిందని ఎఫ్‌ఆర్‌వో మజారొద్దీన్ తెలిపా రు. బుధవారం అటవీ అధికారులతో కలిసి ల చ్చునాయక్ తండా, లక్మాపూర్ గ్రామాల్లో ప ర్యటించారు. గాయపడిన లేగదూడను పరిశీ లించారు. పెద్దపులి మహా రాష్ట్ర అడవులకు వెళ్లినట్లు తెలిపారు. చిరుత పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు విజయ్‌కుమార్, రామ య్య, నజీర్ అలీ, నర్సయ్య, దేవిదాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment