రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతా
● హుస్నాబాద్‌ను సుందరీకరిస్తా.. ● రేషన్ దుకాణాల సంఖ్యపెంచేందుకు చర్యలు ● మున్సిపాలిటీల్లోనూ ఉపాధిహామీఅమలుకు కృషి ● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: అభివృద్ధిలో హుస్నాబాద్ పట్టణాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పట్టణంలో 3, 4, 5, 10వ వార్డుల్లో ఒక్కో వార్డుకు రూ.50లక్షల చొప్పున రూ.2కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణ పనులకు గురువారం కలెక్టర్ మనుచౌదరితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పట్టణంలోని 20 వార్డుల్లో రూ.50లక్షల చొప్పున ప్రతి వార్డులో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణంలో రీడింగ్ రూమ్స్ పేరుతో రూ.45లక్షల చొప్పున కేటాయించినట్లు చెప్పారు. బుడగ జంగాల కాలనీలో ఇందిరమ్మ పేరు మీద కమ్యూనిటీ హాలు నిర్మిస్తామన్నారు. గాంధీ, అంబేడ్కర్, నాగారం, కరీంనగర్ చౌరస్తాల అభివృద్ధికి రూ.50లక్షల చొప్పున కేటాయించినట్లు తెలిపారు. పట్టణంలో వర్షాలకు వరద నీరు ఇళ్ళల్లోకి రాకుండా డ్రైనేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. హుస్నాబాద్ పట్టణంలో 2006లో 8 రేషన్ షాపులు ఉంటే 2024లో కూడా 8 షాపులు ఉండటం దురదృష్టకరమన్నారు. జనాభాకు తగ్గట్లుగా కొత్త రేషన్ షాపులు తెచ్చి ప్రజల ఇ బ్బందులు తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామీణ. ఇక్కడ ఉపాధి హామీ పఽథకం లేకపోవడంతో కూలీలు పనుల కోసం వలస వెళుతున్నారని తెలిపారు. మున్సిపాలిటిల్లో కూడా ఉపాధి హామీ పఽథకం వర్తించేలా ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అభివృద్ధి పనులకు, ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాలకు సీఎం లేదా డిప్యూటి సీఎంను ఆహ్వానిస్తామన్నారు. కార్యక్రమ ంలో ఆర్టీఓ రామ్మూర్తి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment