నాటిన మొక్కలను కాపాడాలి
డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు
చేగుంట(తూప్రాన్): జిల్లాలో 37 వేల మంది మహిళా సంఘాల సభ్యులతో హరితహారం మొక్క లు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం చేగుంట స్పోర్ట్స్ గిరిజన గురుకుల పాఠశాలలో కొబ్బరి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. నాటిన మొక్కలను కాపాడే బాధ్యత స్థానికులే తీసుకుంటే బాగుంటుందన్నా రు. గురుకులంలో రెండువందల కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమం గొప్ప విషయమని, భవిష్యత్‌లో కొబ్బరి చెట్లతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. నాయకుడు పరంజ్యోతి ఖర్చులను భరించడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి విద్యార్థి కొబ్బరి మొక్కలను పెంచే బాధ్యతను తీసుకొని గురుకులంలో పచ్చదనం పెంపొందించే విధంగా చూడాలని చెప్పారు. ప్రిన్సిపాల్ సుమతి, ఏపీడీ సరస్వతి, డీపీఓ ప్రకాశ్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, ఏపీఓ శ్వేత, ఆయా గ్రామాల సీసీలు, మహిళా సంఘాల వీఓఏలు విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment