భూ సర్వేను వేగవంతం చేయండి
మెదక్‌జోన్: నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ పనుల కోసం భూ సర్వేను వేగవంతం చేయాలని కల్టెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 765– డీజీ మెదక్ – సిద్దిపేట నుంచి ఎల్లారెడ్డి ఎన్‌హెచ్– 765 డీ రోడ్డు నిర్మాణ భూ సర్వేను వేగంగా చేయాలని ఆదేశించారు. మెదక్– సిద్దిపేట 69.97 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం కోసం రూ. 500 కోట్లు కేటాయించారని, మెదక్– ఎల్లారెడ్డి 43 కిలోమీటర్లకు గానూ రూ. 200 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. కాగా భూసర్వేలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమవుతే సంబంధిత అధికారులు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, నేషనల్ హైవే ఈఈ బలరాంకృష్ణ, డీఈ ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
తూప్రాన్: ధాన్యం సేకరణను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం మండలంలోని రావెల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కొనుగోలు ప్రక్రియ సజావుగా, సక్రమంగా చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment