ప్రతి ఇంటిని సర్వే చేయాలి
కౌడిపల్లి(నర్సాపూర్)/రామాయంపేట/నిజాంపేట(మెదక్): ప్రతి ఇంటిని సర్వే చేయాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. గురువారం మండలంలోని ధర్మాసాగర్లో కుటుంబ సర్వేను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి స్టిక్కర్ వేసి వివరాలు సేకరించాలని సూ చించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నరహరి తదితరులు పాల్గొన్నారు. అలాగే రామా యంపేట మండలంలోని అక్కన్నపేటలో కుటుంబ సర్వేను పర్యవేక్షించారు. అలాగే నిజాంపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కులగణన సర్వేను పరిశీలించారు.
త్వరలో కోర్టు సేవలు
చేర్యాల(సిద్దిపేట): చేర్యాలలో కోర్టు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ కోర్టులో ఉద్యోగుల నియామకం జరగకపోవడంతో సేవలు ప్రారంభం కాలేదు. కోర్టుకు అవసరమైన ఉద్యోగులను నియమిస్తూ గురువారం ప్రిన్సిపల్ సెక్రటరీ సనీప్కుమార్ సుల్తానీయా జీఓ జారీ చేశారు. జీఓ జారీ కావడం పట్ల స్థానికంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు తమ కృషి వల్లనే జీఓ వచ్చిందంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment