అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ మూవీకి వారం రోజుల్లోనే రూ. 1067 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా తెలిపారు. అయితే, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పుష్ప2 సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని నెటిజన్లు ఆరా తీశారు. సంధ్య థియేటర్ ఘటనతో బన్నీ అరెస్ట్ తర్వాత కలెక్షన్స్‌పై ఏమైనా ప్రభావం చూపుతాయా అని అంచనా వేశారు. దీంతో శుక్రవారం నాడు పుష్ప2 కలెక్షన్స్ ఎంత వచ్చాయని అందరిలో ఆసక్తిగా మారింది.
పుష్ప 2 మొదటి వారం నాటికి రూ. 1067 కోట్ల గ్రాస్ వచ్చిందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా రూ. 38 కోట్ల నెట్ వచ్చింది. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన శుక్రవారం నాడు మాత్రం రూ. 36.25 కోట్ల నెట్ వచ్చింది. బన్నీ అరెస్ట్ ఘటన పుష్ప కలెక్షన్స్‌పై పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పవచ్చు. శుక్రవారం తెలుగులో రాష్ట్రాల్లో రూ. 7 కోట్లు, బాలీవుడ్‌లో రూ. 27 కోట్లు, తమిళంలో రూ.1.3 కోట్లు, కర్ణాటక , కేరళ రూ.2 లక్షల వరకు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.
ముఖ్యంగా బాలీవుడ్‌లో అల్లు అర్జున్ కలెక్షన్స్ పరంగా ర్యాంప్ ఆడించేస్తున్నాడని చెప్పవచ్చు. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో రూ. 450 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 కేవలం తొమ్మిదిరోజుల్లోనే రూ. 1120 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. బన్నీ అరెస్ట్ కావడంతో చిత్ర నిర్మాణ సంస్థ బాక్సాఫీస్ లెక్కలు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.
2024లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా 'పుష్ప 2 ది రూల్' రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వీకెండ్ శని, ఆదివారాల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే సుమారు 90 శాతం కలెక్షన్స్ రికవరీ సాధించినట్లు తెలుస్తోంది. పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాదాపు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment