నా కోడలు మాయలాడిది.. ఇప్పుడేమో ఏక్‌దమ్‌ చించిపారేసిందట! | Ankita Lokhande Mother In Law Ranjana Praises Her Performance In Swatantra Veer Savarkar Movie - Sakshi
Sakshi News home page

నటిని నానామాటలన్న అత్త.. ఇప్పుడేమో తెగ పొగిడేస్తోంది!

Published Sat, Mar 23 2024 6:54 PM | Last Updated on Sat, Mar 23 2024 7:51 PM

Ankita Lokhande Mother In Law Ranjana Praises Her Performance In Swatantra Veer Savarkar Movie - Sakshi

ఈ అత్తలున్నారే.. ఎప్పుడెలా ఉంటారో ఎవరికీ అర్థం కాదు అని కోడళ్లు ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు. ఇప్పుడు చెప్పే విషయం వింటే వారేంటి.. మీరు కూడా అదే మాట అంటారు. ఇంతకీ ఏం జరిగిందంటే... బుల్లితెర నటి అంకిత లోఖండే ఇటీవలే హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌లో పార్టిసిపేట్‌ చేసింది. తను ఒక్కతే వెళ్లలేదు. వెంట భర్తను కూడా తీసుకెళ్లింది. ఆలూమగలన్నాక గొడవలు సర్వసాధారణమే! కానీ చుట్టూ కెమెరాలున్న సంగతే మర్చిపోయి ఈ దంపతులు వేరే లెవల్‌లో తిట్టుకున్నారు.. కొట్టుకున్నంత పని చేశారు.

అప్పుడేమో తిట్టేసి..
ఇది చూసిన అంకిత అత్త రంజనా జైన్‌కు మండిపోయింది. నా కొడుక్కి కనీస గౌరవం ఇవ్వట్లేదు.. నేనెప్పుడో చెప్పా.. ఈమె అలాంటిది, ఇలాంటిది అంటూ విమర్శల పారాయణం చేసింది. అంకిత.. తన మాజీ ప్రియుడు, దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ను గుర్తు చేసుకుంటే కూడా.. అంతా ఫేమస్‌ అవడం కోసమే, ఓట్ల కోసమే.. పెద్ద మాయలాడి అని నానామాటలు అంది.

ఇప్పుడేమో మెచ్చుకుని
కట్‌ చేస్తే అంకిత కీలక పాత్రలో నటించిన స్వతంత్ర వీర్‌ సావర్కర్‌ సినిమా మార్చి 22న విడుదలైంది. థియేటర్‌లో మూవీ చూసిన అంకిత అత్తయ్య.. నా కోడలు ఎంత బాగా కనిపిస్తుందో! మా అంకిత ఏ1. ఏక్‌దమ్‌ యాక్ట్‌ చేసింది అని మెచ్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. కమల్‌ హాసన్‌ను మించిపోయిందిగా అని కామెంట్లు చేస్తున్నారు.

నటి పారితోషికం?
ఇకపోతే స్వతంత్ర వీర్‌ సావర్కర్‌ సినిమా కోసం డైరెక్టర్‌ కమ్‌ హీరో రణ్‌దీప్‌ హుడా 32 కిలోలు తగ్గాడు. కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే రూ.6 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ తొలి రోజు ఈ చిత్రం కేవలం కోటి రూపాయల పైచిలుకు మాత్రమే సాధించడం గమనార్హం. ఈ మూవీకి అంకిత ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు.

చదవండి:  ఆ సినిమాలు చేశానని వేశ్య అని ట్రోల్‌ చేస్తున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement