
ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతో కంటే సోషల్ మీడియాతో మరింత పాపులర్ అయిన సురేఖవాణి.. కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట తెగ రచ్చ చేస్తుంటుంది. మోడ్రన్ డ్రస్సుల్లో కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామరస్ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించిన సురేఖ వాణి సోషల్‌మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
(ఇదీ చదవండి: కుమారుడి కోసం ఏడ్చేవాడు.. రఘువరన్ మృతిపై తొలిసారి మాట్లాడిన సోదరుడు)
తాజాగా కూతురు సుప్రీతతో కలిసి అమెరికాలో అట్లాంటిక్ సిటీలో హల్ చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా సురేఖా వాణి ఈ వీడియోను తన కూతురుతో పంచుకుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
(ఇదీ చదవండి: విశాల్‌పై పగ ఎప్పటికీ తగ్గదు.. సూర్య వెనకున్న శక్తి ఎవరంటే: అబ్బాస్)
ఇదీలా ఉంటే ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ బిగ్‌బాస్-7 కార్యక్రమంలో ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. గత సీజన్‌లలోనే సురేఖ వాణి బిగ్ బాస్‌లోకి వెళ్లనున్నారని వార్తలు వచ్చాయి. అప్పట్లో పలు కారణాల వల్ల ఆమె వెళ్లలేకపోయింది. ఈసారి మాత్రం తప్పకుండా వెళ్తారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే సుప్రీత త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి బిగ్‌బాస్‌కు వెళ్తె ఆమెకు మరింత గుర్తింపు వస్తుందని సురేఖ ప్లాన్ చేస్తుందట. ఒకవేళ సురేఖ వెళ్లలేకపోయిన కూతురుని మాత్రం బిగ్‌బాస్ ఇంట్లోకి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్ 3 నుంచి బిగ్‌బాస్-7 ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment