కన్నడ, తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన నటి శైలా శ్రీ. కన్నడలో పలు సినిమాల్లో నటించింది. 1960-70 రోజుల్లో ప్రముఖ నటిగా పేరు సంపాదించింది. సినిమాల్లో ఆమె చేసిన కృషికి 2019లో కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డు కూడా లభించింది. తెలుగులో కొన్ని సినిమాల్లోనూ నటించింది. సంధ్యారాగ అనే చిత్రంలో చిన్న పాత్రతో వెండితెర అరంగేట్రం చేసింది శైలా శ్రీ.
1971లో నేషనల్ అవార్డు గెలుచుకున్న కన్నడ చిత్రం నాగువా హూవులో ఆమె పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఆమె తెలుగులో భలే అబ్బాయిలు సినిమాలో కనిపించింది. ఆమె కన్నడ నటుడు ఆర్.ఎన్. సుదర్శన్‌ను వివాహం చేసుకుంది. ఆమె అతనితో నాగువ హూవు, కదీనా రహస్య, కల్లారా కల్లా, మాలతి మాధవ, వంటి చిత్రాల్లో నటించింది.
అది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడామె పరిస్థితి దయనీయంగా మారింది. శైలా శ్రీ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమెకు చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. క్యాన్సర్ చికిత్స కోసం బెంగళూరు ఆర్‌ఆర్ నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె మందుల ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నారు. ఆమె పరిస్థితి తెలిసిన దంపతులు ఆర్థికసాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు చెక్‌ను అందజేశారు. తన పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్థిక సాయం అందించినందుకు శైలా శ్రీ సంతోషం వ్యక్తం చేశారు
Comments
Please login to add a commentAdd a comment