విజయ్‌ సినిమాపై రూమర్స్‌.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత | The Greatest of All Time Producer Clarifies Rumours | Sakshi
Sakshi News home page

విజయ్‌ సినిమాపై రూమర్స్‌.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Jul 29 2024 2:17 PM | Updated on Jul 29 2024 2:18 PM

The Greatest of All Time Producer Clarifies Rumours

తమిళ స్టార్‌ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్‌ నటిస్తున్న 50వ చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’  (ది గోట్‌). భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా వాయిదా పడుతుందని నెట్టింట వార్తాలు వస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత తాజాగా రియాక్ట్‌ అయ్యారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, కిచ్చా సుదీప్, లైలా, మీనాక్షీ చౌదరి, స్నేహ, యోగిబాబు, జయరాం ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ సినిమా సెప్టెంబర్‌ 5న విడుదల అవతుందని మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. కానీ, వీఎఫ్‌ఎక్స్‌ పనుల వల్ల సినిమా విడుదల విషయంలో మరింత ఆలస్యం కానుందని ప్రచారం జరుగుతున్న సమయంలో తాజాగా నిర్మాత ఇలా రియాక్ట్‌ అయ్యారు. 'ముందుగా ప్రకటించిన సమయానికే ది గోట్‌ సినిమా విడుదల అవుతుంది. అనుకున్న సమయానికి విడుదల చేయాలని మా టీమ్‌ 24 గంటల పాటు శ్రమిస్తుంది. ఎట్టిపరిస్థితిల్లోనూ సెప్టెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తాం. ఆగష్టు మొదటి వారంలో సినిమా అప్‌డేట్‌ ఇస్తాం. ఈ ప్రకటనతో విజయ్‌ ఫ్యాన్స్‌లో సంబరం మొదలైంది.

సైన్స్ ఫిక్షన్  నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్‌ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ పతాకంపై అత్యాధునిక టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.'డీ-ఏజింగ్‌ టెక్నాలజీ' టెక్నాలజీ సాయంతో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement