శోభితను నాగార్జున ఇలా అనేశాడేంటి? పాత వీడియో వైరల్‌ | Nagarjuna Akkineni Comments Sobhita Dhulipala, Old Video Goes Viral | Sakshi
Sakshi News home page

చై- శోభిత ఎంగేజ్‌మెంట్‌.. కాబోయే కోడలిపై నాగ్‌ కామెంట్స్‌.. పాత వీడియో వైరల్‌

Published Thu, Aug 8 2024 1:22 PM | Last Updated on Thu, Aug 8 2024 1:39 PM

Nagarjuna Akkineni Comments Sobhita Dhulipala, Old Video Goes Viral

హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్‌ శోభిత ధూళిపాళ ప్రేమలో ఉన్నారంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమే అన్నట్లు పలుమార్లు వీరు కలిసున్న ఫోటోలు నెట్టింట లీకయ్యాయి కూడా! ప్రేమించి, పెళ్లి చేసుకున్న సమంతకు విడాకులిచ్చిన తర్వాత చై.. శోభితకు దగ్గరయ్యాడని, త్వరలోనే వివాహబంధంలోనూ అడుగుపెట్టనున్నారన్నది గాసిప్‌రాయుళ్లు చెప్తున్న మాట.

చై ఇంట్లో ఎంగేజ్‌మెంట్‌
చివరకు అదే నిజమైంది. చై-శోభితల నిశ్చితార్థం జరిగింది. నేడు ఈ ప్రేమ జంట ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ క్రమంలో శోభిత గురించి నాగార్జున స్టేజీపై మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది. 

చాలా బాగుంది
అందులో నాగ్‌.. 'శోభిత ధూళిపాళ చాలా బాగుంది. ఈ మాట నేను అనకూడదు కానీ.. తను చాలా హాట్‌! తనలో అందరినీ అట్రాక్ట్‌ చేసే శక్తి ఉంది' అని పేర్కొన్నాడు. 2018లో గూఢచారి సక్సెస్‌మీట్‌లో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత వీడియో ఇప్పుడు వైరలవుతుండటంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. 

ఇలా అనేశాడేంటి?
'సమంత- చై కలిసున్నప్పుడు నాగార్జున ఇలా మాట్లాడాడు. అయినా ఒక యంగ్‌ హీరోయిన్‌ గురించి అట్రాక్టివ్‌ అని చెప్పుంటే సరిపోయేదిగా', 'అప్పుడు ఆమె నటి.. కానీ ఇప్పుడు కాబోయే కోడలు..' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా 2017లో సామ్‌-చై పెళ్లి చేసుకోగా 2021లో విడాకులు తీసుకున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement