డబ్‌స్మాష్‌లతో బాగా పాపులరైంది అషూ రెడ్డి. జూనియర్ సామ్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. పలు షోలతో బుల్లితెరపై సందడి చేస్తున్న ఈ భామ బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొనబోతుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ నిర్వహించిన అషూ ఈ విషయాన్ని తనే లీక్ చేసింది. ఇన్‌స్టా లైవ్‌లో జెస్సీతో ముచ్చటించింది అషూ.
ఈ సందర్భంగా జెస్సీ తన సినిమా అప్‌డేట్స్ చెప్పుకురాగా.. బయటకు వచ్చాకే నీ సినిమా చూస్తాను జెస్సీ అంటూ బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నట్లు చెప్పకనే చెప్పింది. దీంతో జెస్సీ.. దీన్నే నోటిదూల అంటారని సెటైర్ వేశాడు. ఇక లైవ్ సెషన్‌లో నెటిజన్లు చిత్రవిచిత్ర ప్రశ్నలతో అషూను ఆడుకున్నారు. అషూ, మనం లేచిపోదాం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా ఇది చూసిన బిగ్‌బాస్ బ్యూటీకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఓకే చిల్ అని రిప్లై ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment