ఆ పాన్‌ ఇండియా చిత్రంలో పవర్‌ ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా ప్రభాస్‌ | Prabhas As In Police Officer With Nag Ashwin Pan India Movie | Sakshi
Sakshi News home page

Prabhas: ఆ పాన్‌ ఇండియా చిత్రంలో పవర్‌ ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా ప్రభాస్‌

Published Thu, Oct 14 2021 8:53 AM | Last Updated on Thu, Oct 14 2021 1:16 PM

Prabhas As In Police Officer With Nag Ashwin Pan India Movie - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ భారీ బడ్జెట్‌ చిత్రాల షూటింగ్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో పాన్‌ ఇండియా సినిమాలు ‘రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌’తో పాటు నాగ్‌ అశ్విన్‌తో మరో పాన్‌ ఇండియా చిత్రం ఉంది. వీటితో పాటు ఇటీవల ప్రభాస్‌ 25వ చిత్రంపై కూడా ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇలా వరుస పాన్‌ ఇండియా చిత్రాలతో ప్రభాస్‌ దూసుకుపోతున్నాడు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్‌ త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. మరోవైపు ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న ‘సలార్‌’ షూటింగ్‌ చివరి దశకు చేరుకోగా.. ఆది పురుష్‌ షూటింగ్‌ను జరపుకుంటోంది.

చదవండి: శ్రియ ప్రెగ్నెన్సీని దాచడంపై స్పందించిన మంచు లక్ష్మి

ఇక నాగ్‌ అశ్విన్‌ సినిమా అప్‌డేట్‌ ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ మూవీకి స్పందించిన ఓ ఆసక్తికరమైన న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం.. నాగ్‌ అశ్విన్‌తో సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి రానుందని, ఇందులో ప్రభాస్‌ పవర్‌ ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా ఈ మూవీ సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని, ఇది ఒక అద్భుతమైన ప్రయోగమంటూ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్‌లో ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. 

చదవండి: ప్రభాస్‌ 25వ చిత్రం: అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌..టైటిల్‌ ఇదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement