ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తీస్తుంటారు దర్శకులు. కానీ ప్రేక్షకులు మెచ్చినా, మెచ్చకపోయినా తనకు నచ్చిన రీతిలోనే సినిమాలు తీస్తుంటాడు రామ్‌గోపాల్ వర్మ. గతంలో ఇండస్ట్రీకి అనేక బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన ఆర్జీవీ గత కొంతకాలంగా మాత్రం తలాతోక లేని సినిమాలు తీస్తూ విమర్శలపాలవుతున్నాడు. అయినా సరే, ఎవ్వరిమాటా పట్టించుకోని వర్మ జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త చిత్రాలు తీసుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో కొత్తవారికి కూడా అవకాశాలు ఇస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ప్రతిభ ఉన్న కొత్తవారిని ప్రోత్సహించేందుకు ఆర్జీవీ డెన్‌ను ఏర్పాటు చేశాడు. గతంలో ముంబైలో ఆర్జీవీ కంపెనీని ప్రారంభించగా ఇప్పుడేమో హైదరాబాద్‌లో డెన్ అనే కొత్త ఆఫీస్‌ను ఏర్పాటు చేశాడు. ఈ డెన్ వర్మ మనస్తత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఆర్జీవీ ఆఫీస్ అంటే మామూలుగా ఉంటుందా? ఇందులో బ్రూస్‌లీ ఫోటో నుంచి బూతు బొమ్మల దాకా అన్నీ ఉన్నాయి.
అలాగే వర్మ ప్రముఖులతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ రెండంతస్తుల భవనంలో ఆకట్టుకునే కొటేషన్లు కూడా ఉన్నాయి. వర్మ దర్శకుడిగా పరిచయమైంది శివ సినిమాతోనే కాబట్టి ఈ డెన్‌లో అక్కినేని నాగార్జునకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. మొత్తానికి ఈ కార్యాలయానికి వెళ్లినవారికి ఆర్జీవీ ఏంటో తెలిసిపోవడం ఖాయం. ఈ డెన్ చూసిన వాళ్లు అతడు ఏం చేసినా కొంత కొత్తగా మరికొంత వింతగా ఉండటం సహజమే అని అంటుంటే, మరికొందరు మాత్రం ఈ ఆఫీస్ పోర్న్ హబ్‌లా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.
చదవండి: త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్.. చిరంజీవి ఇంటికి షిఫ్ట్ కానున్న చెర్రీ-ఉపాసన
Comments
Please login to add a commentAdd a comment