పూర్తిగా లడఖ్ ప్రాంతంలో తెరకెక్కించిన మొదటి భారతీయ చిత్రం ‘ఆన్ ది రోడ్’ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషలలొ విడుదలకు సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను, ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమాలోని విజువల్స్‌ను ఆయన మెచ్చుకోవడమే కాకుండా ఇలాంటి అవుట్ పుట్ తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఆన్ ది రోడ్ టీమ్ మెంబర్స్‌ను ప్రశంసించారు, సినిమా విజయం సాధించాలని ఆయన కోరారు. ఈ చిత్ర దర్శకుడు సూర్య లక్కోజు గతంలో రామ్ గోపాల్ వర్మతో కలిసి పలు చిత్రాలకు పని చేయడం విశేషం.
ప్రముఖ చిత్ర నిర్మాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) ఉపాధ్యక్షులు ముత్యాల రామ్ దాస్ ఈ సినిమా విడుదలకు సహకారం అందిస్తూ ఈ ప్రాజెక్టులో ఒక భాగం అయ్యారు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుందని చెప్పారు. ఎస్ పీ ఎల్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్నిసూర్య లక్కోజు నిర్మించారు. రాజేష్ శర్మ ఈ సినిమాకు సహ నిర్మాత.
ఇదొక రోడ్ ట్రిప్ థ్రిల్లర్ అయినప్పటికీ, సేఫ్‌గా రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్న ఒక జంటతో ఒక సాధారణ వ్యక్తి కలవడం, అతను వారితో ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత చోటు చేసుకున్న కల్లోల సంఘటనలే ఈ చిత్ర కథాంశమని మేకర్స్ తెలిపారు. చిత్ర నాయకి అయిన స్వాతి మెహ్రా తన మొదటి సినిమా లడఖ్ లాంటి అందమైన ప్రాంతంలో తెరకెక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో హీరోగా రాఘవ్ తివారీ అద్భుతంగా నటించారని చిత్ర మేకర్స్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment