సరైన సమయంలో చికిత్స అందడం వల్లే సాయి ధరమ్ తేజ్‌కు ప్రాణాపాయం తప్పిందంటున్నారు తేజ్‌కు మొదట ట్రీట్‌మెంట్ చేసిన మెడికవర్ వైద్యులు.. గోల్డెన్ అవర్‌లో అతన్ని ఆస్పత్రికి తీసుకురావడం, ఆ టైమ్‌లో ఇచ్చిన ట్రీట్‌మెంట్ వల్లే సాయి తేజ్ ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. 108 సిబ్బంది సమయానికి అతన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు.
ప్రమాదంలో తేజ్ కిందపడటంతో ఫిట్స్ వచ్చాయని, తమ ఆస్పతికి వచ్చేలోపే అపస్మారకస్థితిలో ఉన్నారని తెలిపారు. మరోసారి ఫిట్స్ రాకుండా ట్రీట్‌మెంట్ ఇచ్చామని తెలిపారు. ఆ తర్వాత బ్రెయిన్, స్పైనల్ కార్డ్, షోల్డర్, చెస్ట్ అబ్‌డామిన్ స్కానింగ్‌లు చేశామన్నారు. హెల్మెట్ పెట్టుకోవడంతో లక్కీగా అతని తలకు గాయాలు కాలేదన్నారు.. కాకపోతే శ్వాస తీసుకోవడానికి కొంత ఇబ్బంది పడ్డాడని.. దీంతో కృత్రిమ శ్వాస పెట్టాల్సి వచ్చిందన్నారు.
(చదవండి: సాయిధరమ్ తేజ్ మా ఇంటి నుంచే బయలుదేరాడు: నరేశ్)
కాగా, హీరో సాయి తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నేడు కూడా ఐసీయూలోనే సాయి తేజ్‌కు చికిత్స అందిస్తామని వెల్లడించారు. రేపు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment