నలిగిన వలస బతుకులు | - | Sakshi
Sakshi News home page

నలిగిన వలస బతుకులు

Published Mon, Jan 27 2025 6:58 AM | Last Updated on Mon, Jan 27 2025 6:58 AM

నలిగి

నలిగిన వలస బతుకులు

సాక్షి, వరంగల్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లోని గరీబ్‌నగర్‌ నగర్‌కు చెందిన నువురు సంతోశ్‌ చౌహా న్‌ కుటుంబానిది రెక్కాడితే గాని డొక్కాడానీ కు టుంబం. కత్తులు, కొడవళ్లు, గొడ్డలి, పారలతోపా టు ఇతర వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తూ జీవనాన్ని వెళ్లదీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఐదురోజుల క్రితం మామునూరుకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన అతడి అన్న కొడుకు సు మీర్‌ కుటుంబం డేరా వేసుకొని జీవనం వెళ్లదీస్తుండడంతో వారి పక్కనే మరో డేరా వేసుకొని పని చేసుకుంటున్నారు. రెండు కుటుంబాలు ఒక్క దగ్గరే ఉంటుండడంతో వచ్చిన గిరాకీ కుటుంబ ఖర్చుల కు సరిపోకపోవడంతో అక్కడికి వచ్చిన ఇతరుల ద్వారా లోహిత గ్రామానికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే మామునూరు బెటా లియన్‌ నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంక్‌కు కూతవేటు దూరంలో 18 టైర్లతో కూడిన ట్రేలర్‌ ట్రక్‌ అతివేగంతో అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉ న్న భారీ ఇనుప రాడ్లు ఎగిరి కాస్త ముందు ఉన్నమరో ఆటోపై ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో నువురు సంతోశ్‌ చౌహాన్‌(45), అతడి కుమార్తెలు పూజ చౌహా న్‌(18), కిరణ్‌ చౌహాన్‌(18) అక్కడికక్కడే మ రణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుమా రుడు ఖన్నా (8) చనిపోయాడు. ఇనుపరాడ్లు పడడంతో మృతదేహాలు గుర్తుపట్టరాకుండా ఛిద్రమయ్యాయి.

మూడు జేసీబీలతో ఇనుపరాడ్ల తొలగింపు

ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులకు అప్పటికే ట్రక్‌ రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్‌ జామైంది. దీనికితోడు ఇనుపరాడ్లు తీయడం సవాల్‌గా మారింది. సమీపంలోని మూడు జేసీబీలను తీసుకొచ్చారు. ఇటు ఆర్టీఓ జంక్షన్‌ వైపు హైవే రహదారిని మూసివేసి వాహనాలు రాకుండా చూశారు. ఆ జేసీబీల సాయంతో ఇనుప రాడ్లలో చిక్కుకున్న ఐదుగురు క్షతగాత్రులను బయటకు తీసేందుకు అరగంటకు పైగా సమయం తీసుకుంది. డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా పనిచేశాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌ల్లో వారిని ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత రహదారికి అడ్డుగా ఉన్న ట్రేలర్‌ ట్రక్కును జేసీబీల సాయంతో ఎడమవైపునకు తోసేశారు. రహదారిపై పడి ఉన్న ఇనుపరాడ్లను కుడివైపున పడేశారు. ఆ తరువాత ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు గంటకుపైగా సమయం తీసుకుంది. ఘటనాస్థలిని కలెక్టర్‌ సత్యశారద, పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పరిశీలించారు.

నిన్న వెళ్తే.. ఈ ఘోరం జరిగి ఉండేది కాదు..

మామునూరు ప్రధాన రహదారికి ఆనుకొని వీరు వేసుకున్న డేరా బోసిపోయింది. ఉదయం 11 గంటల వరకు సంతోషంగా ఉన్న ఆ ఫ్యామిలీ 20 నిమిషాల వ్యవధిలో ఘోర ప్రమాదం బారినపడడడంతో అక్కడున్న వారు అయ్యో పాపం అని చర్చించుకోవడం కనిపించింది. ‘ఐదు రోజల పాటు అక్కడే ఆడుతూ పాడుతూ గడిపిన సంతోశ్‌ కుటుంబం శనివారం సాయంత్రమే లోహితకు వెళ్లాల్సి ఉండే. బొల్లికుంట మీదుగా వెళ్తే త్వరగా వెళ్లొచ్చని చెప్పాం. తెలిసిన వారు గవిచర్ల క్రాస్‌ నుంచి ర మ్మని చెబుతున్నారనడంతో ఆటోను రూ.1,000 లకు కిరాయి అడిగితే ఏమీ లేనివారని రూ.500లకు మాట్లాడించి పంపించాం. నిమిషాల వ్యవధిలోనే ఆ కుటుంబం రోడ్డు ప్రమాదం బారినపడడంతో మాకు కన్నీళ్లు ఆగడం లేదు’ అని అక్కడే టైలర్‌ దుకాణంలో పనిచేసే ఓ వ్యక్తి వాపోయాడు.

ట్రేలర్‌ ట్రక్‌ రూపంలో నలుగురిని కబళించిన మృత్యువు

లారీ డ్రైవర్‌ ఓవర్‌ స్పీడ్‌, ఇనుపరాడ్లు

మీదపడడంతో మృతదేహాలు నుజ్జునుజ్జు

మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు..

రూ.200 డీజిల్‌ కొట్టించుకున్నారు...

ఆరుగురు ప్రయాణికులతో వెళుతున్న ఆటో మా పెట్రోల్‌ బంక్‌లో రూ.200 డీజిల్‌ పోయించుకున్నారు. ఫోన్‌ పే పనిచేయకపోవడంతో కాసేపు ఆగారు. చివరకు డబ్బులిచ్చి హైవేపైకి వెళ్లారు. నిమిషాల వ్యవధిలోనే ట్రేలర్‌ ట్రక్కు అతివేగంతో వచ్చి చేసిన ప్రమాదంతో వీరి ఆటో నుజ్జునుజ్జయిది. మేం పోయేసరికే ఆ ఇనుప రాడ్లు పడి అందులో చిక్కుకున్న వారి ఆర్తనాదాలు మాకు వినిపించాయి. ఆ ఇనుపరాడ్లు తీద్దామంటే బాగా బరువు ఉండడంతో తీయలేకపోయాం.

– జాకీర్‌, పెట్రోల్‌బంక్‌ సిబ్బంది

నలుగురిని బలిగొన్న మద్యం మత్తు..

మామునూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ రాజస్థాన్‌ వాసి యోగిందర్‌ సింగ్‌ తీవ్ర మద్యం మత్తులో ఉన్నా డు. అతడికి పోలీసులు బ్రీత్‌ అనలైజర్‌ టెస్టు చేయగా 280 ఎంజీ/100 మిలీ రీడింగ్‌ నమోదైంది. ఇతడి వల్ల నలుగురి ప్రాణాలు పోయాయి. చాలావరకు రోడ్డు ప్రమాదాలు అతివేగం, డ్రంకన్‌ డ్రైవ్‌ వల్లనే జరుగుతున్నాయని, తమకు ఏమాత్రం సంబంధంలేని వ్యక్తుల ప్రాణాలు తీస్తున్నారని వరంగల్‌ సీపీ అంబర్‌ కిశోర్‌ అన్నారు. ఇలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

గంట ముందు మాట్లాడా..

గంట ముందు వరకు నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఇక్కడికి కొద్ది మీటర్ల దూరంలో ఉన్న లోహిత గ్రామానికి వెళుతున్నామని, వచ్చే ఆదివారం కలుసుకుందామని చెప్పారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.

– సుమీర్‌, సంతోశ్‌ అన్న కుమారుడు

No comments yet. Be the first to comment!
Add a comment
నలిగిన వలస బతుకులు1
1/2

నలిగిన వలస బతుకులు

నలిగిన వలస బతుకులు2
2/2

నలిగిన వలస బతుకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement