పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ సైన్స్ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఫెల్లోషిప్స్ కలిగిన విద్యార్థులు యూజీసీనెట్, సీఎస్‌ఐఆర్ నెట్, సీడ్, డీఎస్‌టీ, ఎన్‌ఈఎఫ్‌డబ్ల్యూడీ, డీఎస్‌టీ–ఇన్‌స్పై ర్ లేదా ఎఫ్‌ఐపీ, క్యూఐపీ టీచర్ ఫెల్లోషిప్స్ తదితర నెట్, గేట్, జీప్యాట్ నేషనల్ లెవల్ టెస్ట్ స్కోర్స్ నెట్ కలిగిన వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్‌లో దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలని సైన్స్ విభాగాల డీన్ ఆ చార్య జి.హనుమంతు ఒక ప్రకటనలో తెలి పారు. పూర్తి చేసిన అప్లికేషన్లను సంబంధిత కార్యాలయంలో ఫిబ్రవరి 12 లోపు అందజేయాలని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ విద్యార్థులు రూ.800 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బోటనీ 6, కెమిస్ట్రీ 3, జీయాలజీ 1, మ్యాథ్‌మెటిక్స్ 5, ఫిజిక్స్ 2, జూవాలజీ 11 సీట్లు ఉన్నాయని వివరించారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
కేయూ క్యాంపస్: యువత మత్తుకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కాకతీయ యూ నివర్సిటీ జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో మత్తు పదార్థాల నియంత్రణపై రెండ్రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ ఆదివారం ముగిసింది. ఎంపిక చేసిన ఉమ్మడి జిల్లాకు చెందిన యవత ఇందులో పాల్గొనగా.. ముగింపు సమావేశంలో ఈ సం నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మా ట్లాడారు. యువత తమలోని నైపుణ్యాలను వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి సమాజాని కి ఉపయోగించుకోవాలన్నారు. రిసోర్స్‌పర్స న్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ వల్లాల పృథ్వీ రాజ్ కమ్యూనిటీ మొబలైజేషన్‌పై అవగాహన కల్పించారు. జిల్లా యువజన అధికారి చింతల అన్వేశ్, యాంటీ నార్కోటిక్స్ సీఐ రవీందర్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సైకియాట్రిస్ట్ విభా గం డాక్టర్ సాయికిరణ్, ప్రొఫెసర్ మురళి, డాక్టర్ నవీన్, గణిత విభాగాధిపతి డాక్టర్ భారవిశర్మ, హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ ఎల్పీ రాజ్‌కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత మధు, నెహ్రూ యువ కేంద్రం సూపరింటెండెంట్ బానోత్ దేవీలాల్, న్యాయవాది మహేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment