మెరుగైన వైద్యం అందించండి
● క్షతగాత్రులను పరామర్శించిన వరంగల్ కలెక్టర్ సత్యశారద
ఎంజీఎం: మామునూరు వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో క్షతగాత్రులైన వారికి మెరుగైన వైద్యం అందించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఎంజీఎం వైద్యాధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనను పరిశీలించిన అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. కాగా, స్వల్ప గాయాలపాలైన ఆటో డ్రైవర్ షకీల్‌ను వైద్య చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల కోరిక మేరకు పోస్టుమార్టం పూర్తి చేసిన మృతదేహాలను, చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలెక్టర్ సత్యశారద ఆదేశాలతో ఎంజీఎం పరిలపాధికారులతోపాటు వరంగల్, ఖిలావరంగల్ తహసీల్దార్‌లు ఇక్బాల్, నాగేశ్వర్‌రావులు దగ్గరుండి ప్రత్యేక అంబులెన్స్‌లో వారి స్వగ్రామానికి పంపించారు.
మంత్రి సురేఖ పరామర్శ..
ఆస్పత్రిలోని క్షతగాత్రులను సాయంత్రం మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు పరామర్శించారు. ఈ సందర్బంగా వారి ఆరోగ్య పరిస్థితుల గురించి ఎంజీఎం సూపరిండెంట్ డాక్టర్ మురళీని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment