ఎస్సార్‌లో ‘షణ్ముఖ ప్రియ’ హంగామా
● ఆకట్టుకున్న ప్రదర్శన
● ఆదిరిన విద్యార్థుల ర్యాంప్‌వాక్
● ముగిసిన స్పార్క్రిల్ వేడుకలు
హసన్‌పర్తి: ఎస్సార్ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన స్పార్క్రిల్ వేడుకలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా ప్రముఖ గాయని షణ్ముఖ ప్రియ బృందం హంగామా చేసింది. షన్ముఖ పాటలకు వేదిక కింద ఉన్న విద్యార్థులు స్టెప్పులు వేశారు. ముంబాయి సినిమాలోని ‘హమ్మ .. హమ్మ’ అనే పాటకు విద్యార్థుల కేరింతలతో ఆ ప్రాంతం మార్మోగింది. తొలుత కళాశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు మంత్రముగ్థులను చేశాయి. విద్యార్థుల ర్యాంప్ వాక్ ఆదిరింది. వివిధ వేషధారణలో విద్యార్థులు ర్యాంప్‌పై ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన నాటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి మాట్లాడుతూ సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులతో మానసిక వికాసం పెంపొందుతోందన్నారు. కార్యక్రమంలో ఎస్సార్ యూనివర్సిటీ వీసీ దీపక్‌గార్గ్, రిజిస్ట్రార్ అర్చనారెడ్డి, డాక్టర్ సుధాకర్, ప్రోగ్రాం కన్వీనన్లు శశిధర్‌రెడ్డి, వాణిశ్రీ, భావన తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment