No Headline
గ్రేటర్ వరంగల్ స్మార్ట్‌సిటీ పనులకు నిధుల సమస్య తీరడం లేదు. ఈ పథకం కింద రూ.981 కోట్లతో చేపట్టిన పనులు నిధుల లేమి కారణంగా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఏటా బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీలకు కేటాయింపులున్నా వరంగల్‌కు వచ్చే నిధుల విడుదల్లో ప్రతీసారి చిన్నచూపే. ఫలితంగా ఓరుగల్లు స్మార్ట్‌సిటీ కల నెరవేరడం లేదు.
● ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 360 ఎకరాల స్థల సేకరణ చేశారు. కనీసం రూ.250 కోట్లయినా కేటాయిస్తే యూనివర్సిటీ నిర్మాణ పనులు సాగే అవకాశం ఉండేది. గత బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ఈ రెండు గిరిజన యూనివర్సిటీలకు కలిపి రూ.67 కోట్లు మాత్రమే కేటాయిరచగా.. ఈ ఏడాది ములుగులో పాత భవనంలో ప్రారంభమైన క్లాసులకు పలుమార్లు నోటిఫికేషన్ ఇచ్చినా 14 మందే అడ్మిషన్లు తీసుకున్నారు.
● విలువ ఆధారిత పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని చెబుతున్నా.. ఆ దిశగా ప్రయత్నం జరగడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 లక్షల మంది రైతులు 19 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు మిర్చి, పసుపు సాగవుతున్నాయి. కేంద్రం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఏటా మద్దతు ధరను పెంచడంతోపాటు పంటలకు విలువ ఆధారిత పరిశ్రమల (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు) ఏర్పాటుకు ఈసారైనా నిధులు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. పసుపు, పత్తి, మిర్చి, మామిడి, మొక్కజొన్నలో నాణ్యమైన విత్తనాలను రూపొందించడానికి పరిశోధన స్థానాల ఏర్పాటు డిమాండ్ పెండింగ్‌లో ఉంది.
● వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో స్పిన్నింగ్, కలర్‌డై యార్న్ మిల్లుల ఏర్పాటు ప్రతిపాదనకు మోక్షం కలగలేదు.
● ప్రతీజిల్లాకు కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, హనుమకొండలో సైనిక్ పాఠశాలను ఏర్పాటు చేయాలనేది ప్రజలకు తీరని కోరికలుగానే ఉన్నాయి.
● వరంగల్ మామునూరులో నిజాం కాలంలో నిర్మించిన విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ఓరుగల్లు వాసులు ఎప్పటినుంచో కోరుతున్నా.. ఎప్పుడూ ఒక్కడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈసారి స్పష్టత వస్తుందన్న ఆశ ఉంది.
● ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన కాకతీయ కాలం నాటి దేవాలయాల అభివృద్ధి, టూరిజం సర్క్యూట్‌ల ఏర్పాటు భారీగా నిధులు ఇవ్వాలని కోరినట్లు ఎంపీలు కడియం కావ్య, బలరాం నాయక్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment