3 నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్
ములుగు: ఈ నెల 3వ తేదీ నుంచి ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి చంద్రకళ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాలలు పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 1,164 మంది జనరల్ విద్యార్థులు, 241 మంది ఒకేషనల్ విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నట్లు తెలిపారు.
మహాప్రదర్శనను
విజయవంతం చేయాలి
ములుగు: ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన లక్షల డప్పులు.. వేల గొంతుకలు మహాప్రదర్శనను విజయవంతం చేయాలని కవి, గాయకుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ మిట్టపల్లి సురేందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ అనుభంద సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాయల్‌ప్లాజా హోటల్‌లో నిర్వహించిన ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి శ్యాంబాబు మాదిగ ఆధ్వర్యంలో జరుగగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాదిగల ఏబీసీడీ విభజన కోసం ఎక్కడా జరగని విధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శన చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ఆయా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఇన్‌చార్జ్ ఇరుగు పైడిమాదిగ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, మాజీ సర్పంచ్ గుగ్గిళ్ల సాగర్, డీఎస్పీ నాయకులు తరుణ్, వీహెచ్‌పీఎస్ అధ్యక్షుడు భద్రునాయక్, సీపీఐ మండల కార్యదర్శి ముత్యాల రాజు, ప్రజాసంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్, బొచ్చు సమ్మయ్యమాదిగ, చరణ్, పేరాల బలరాం, శ్యాం, రవీందర్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment