ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ములుగు: సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రహదారి భద్రత మన అందరి బాధ్యతని కలెక్టర్ దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం నుంచి జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం ముగింపు సందర్భంగా శుక్రవారం సురక్ష అభియాన్ శ్రద్ధ రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు రక్షించాలన్నారు. జిల్లాలో రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రతీఇంటికి భగీరథ నీరు
జిల్లాలోని ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ తాగునీరు అందేలా చూడాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగరీథ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌కు సంబంధించి మూడు నెలల యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలన్నారు. వేసవికాలం సమీస్తున్న క్రమంలో ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. గత సంవత్సర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది పునరావృతం కాకుండా చూడాలన్నారు. తాగునీటికి ప్రత్యామ్నాయంగా ఉన్న బావులు, చెరువులు, హ్యాండ్ పంపులు, బోర్‌వెల్స్, ట్యూబ్‌వెల్స్, వ్యవసాయ బోర్లను గుర్తించి అత్యవసర సమయంలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథఽ సీఈ సురేష్, ఎస్‌ఈ మల్లేశం, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈలు, ఏఈలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర
Comments
Please login to add a commentAdd a comment