ఉపాధ్యాయులు మార్గనిర్దేశకుడిగా ఉండాలి
వెంకటాపురం(ఎం): విద్యార్థులు ఉన్నత శిఖరాల వైపు ప్రయాణించాలంటే ఉపాధ్యాయుడు మార్గ ని ర్దేశకుడిగా ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని తెలిపారు. శుక్రవారం మండలంలోని జవహర్‌నగర్ మోడల్‌స్కూల్‌లో కెరీర్ కౌన్సిలింగ్, గైడె న్స్‌పై రెండు రోజులుగా ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ ఉపాధ్యాయుల చే తుల్లోనే ఉంటుందన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు భవిష్యత్ కార్యాచరణపై విద్యార్థులకు మా ర్గనిర్ధేశం చేస్తూ సన్మార్గంలో ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు అంటే భయం లే కుండా ప్రశాంత వాతావరణంలో రాసేలా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలన్నారు. ప్రతీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, డీసీఈబీ ద్వా రా అమలుకానున్న 40 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. రాష్ట్రంలోనే ములుగు జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ప్లానింగ్ కోఆర్డినేటర్ అర్షం రాజు, కోఆర్డినేటర్లు సైకం శ్రీనివాస్‌రెడ్డి, సాంబయ్య, జి ల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, మురళీధర్, ప్రతాప్, ఫణిందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని
Comments
Please login to add a commentAdd a comment