మాదకద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం
నాగర్‌కర్నూల్: మాదకద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ కలిసిరావాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులు అవుతున్నారన్నారు. ప్రస్తుతం సమాజాన్ని ఆల్కహాల్, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు పట్టి పీడిస్తున్నాయని, వాటికి దూరంగా ఉండేలా యువత, పెద్దలు కృషిచేయాలన్నారు. విద్యార్థులు, యువత ఉన్నత లక్ష్యంతో వెళ్తున్న క్రమంలో ఏమాత్రం పెడదారిన వెళ్లినా వారి జీవితాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, దీనిని తల్లిదండ్రులు గుర్తించాలని కోరారు. మత్తు పదార్థాలకు ప్రతిఒక్కరూ దూరంగా ఉన్నప్పుడే నవసమాజం నిర్మాణమవుతుందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా మాదకద్రవ్యాల వాడకం నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, కళాజాతా బృందాలతో గ్రామాల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిమాణాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ సత్యనారాయణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గాయత్రి, డీఐఈఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి
భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే ఎంతో గొప్పదని ఇతర దేశాలకు స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్ని వర్గాల వారికి ప్రాథమిక హక్కులు కల్పించిందని, ప్రతిఒక్కరు స్వాతంత్య్ర ఫలాలను అనుభవించేందుకు అండగా ఉంటుందన్నారు. అనంతరం అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment