ఇదిలాఉండగా, గత బుధవారం విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా.. ఆహార శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించామని, నాసీరకమైన కోడి గుడ్లు తినడం వల్లే అస్వస్థతకు గురైనట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివరించారు. కానీ, ఈ మంగళవారం భోజనం నాణ్యతగా ఉందని, విద్యార్థులు బయటి చిరుతిండ్లతోనే అస్వస్థతకు గురి అయి ఉంటారని చెప్పుకొచ్చారు. 400 మంది విద్యార్థులలో కొంతమందికే అలా ఎందుకు జరుగుతుందని, సైకాలజీ కోణంలోనూ విచారణ చేయడం జరుగుతోందన్నారు. తాజా ఘటనతో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు స్వల్ప జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిసిందని, వారు స్వల్ప గాబరా చెందడంతో మిగతా విద్యార్థులు ఆందోళకు గురయ్యారని కలెక్టర్ తెలిపారు. వారం కిందట జరిగిన ఘటన కూడా మధ్యాహ్న భోజనం వల్లే అని కాకుండా మిగతా కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని చెప్పారు. మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్పీ యోగేష్ గౌతమ్, స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment