బాల్యవివాహాల నిర్మూలన అందరి బాధ్యత
నాగర్‌కర్నూల్ క్రైం: బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా జడ్జి రాజేష్‌బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కోనేరు స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిరోధక చట్టం 1929 బ్రిటీష్ కాలంలో అమల్లోకి వచ్చిందన్నారు. ఆ చట్టంలో అనేక మార్పులు చేసిన కేంద్రం.. 2006లో అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు. బాల్యవివాహాల నిరోధక చట్టం ప్రకారం వివాహ వయసు పురుషుడికి 21, సీ్త్రకి 18 ఏళ్లు పూర్తయి ఉండాలన్నారు. మైనర్లను వివాహం చేసుకుంటే రూ. లక్ష జరిమానాతో పాటు రెండేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం ఉందన్నారు. బాల్యవివాహాలను ప్రోత్సహించిన వారితో పాటు వివాహం జరిపించిన తల్లిదండ్రులు శిక్షార్హులేనని తెలిపారు. విద్యార్థులు మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని జీవితంలో ఉన్నతంగా రాణించాలని సూచించారు. సీ్త్ర, పురుషులు యుక్త వయసు వచ్చిన తర్వాతే వివాహం చేసుకోవాలని.. చిన్న వయసులో వివాహం చేసుకున్నట్లయితే మానసిక, శారీరక సమస్యలతో పాటు పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా ఉండరని తెలిపారు. ఎ వరైనా బాల్యవివాహం చేసేందుకు యత్నిస్తే 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లలిత, కోనేరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆంజనేయులు, సఖి సెంటర్ ఇన్‌చార్జి సునీత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment