మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రైతు సదస్సు విజయవంతానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం వారు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, కలెక్టర్లు, ఎస్పీలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఈ సంవత్సరకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మరే రంగానికి లేని విధంగా వ్యవసాయానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించిందని చెప్పారు. ముఖ్యంగా రైతు రుణమాఫీతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 20 వేల మంది నుంచి 30 వేల మంది రైతులకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. రైతులకు పెద్ద ఎత్తున చేకూరిన ఈ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, ఆదర్శ రైతుల ప్రసంగాలు రైతు సదస్సులో ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు. ఒక్కో పంటకు సంబంధించి ఒక్కో ఆదర్శ రైతు తమ అనుభవాలను ఈ సదస్సులో వివరిస్తారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి సదస్సులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనాల పార్కింగ్, స్టాళ్ల ఏర్పాటు, రైతులకు అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీహరి, మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, వ్యవసాయ, సహకారశాఖ కార్యదర్శి రఘునందన్, ట్రాన్స్‌కో సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలుపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment