రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు: కేవీఎన్‌రెడ్డి
కల్వకుర్తి రూరల్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా పత్తిని కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని తుర్కలపల్లి గేటు వద్ద వెంకటేశ్వర కాటన్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం వద్ద పత్తిని తీసుకువచ్చిన రైతులతో మాట్లాడారు. అలాగే కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించి.. కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంతోపాటు మేలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పండిత్‌రావు, నాయకులు శివప్రసాద్, వేమారెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment