పల్లె దవాఖానలో కేంద్ర బృందం తనిఖీ
వెల్దండ: మండలంలోని కొట్ర పల్లె దవాఖానలో బుధవారం కేంద్ర వైద్య బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. జాతీయ ఆరోగ్య మిషన్ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన వైద్యుల బృందం పల్లె దవాఖానలో పలు రికార్డులను పరిశీలించడంతో పాటు వైద్యసేవలపై ఆరా తీశారు. సాధారణ రోగులకు పరీక్షలు, అందిస్తున్న మందులు, దీర్ఘకాలిక వ్యాధులకు ఇచ్చే మందులు తదితర వివరాలను తెలుసుకున్నారు. ఆన్లైన్లో వివరాల నమోదును పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్లు నవీన్‌కుమార్, సింధు, సిబ్బంది మురళీకృష్ణ, అనిత, జానకి, ఎల్లమ్మ, లక్ష్మీబాయి, రాణిబాయి. శ్రీదేవి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment