విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషిచేయాలి
అచ్చంపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కృత్యాధార విధానం ద్వారా బోధించి, వారి సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని డీఈఓ రమేష్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం అచ్చంపేట మండలం రంగాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలతో పాటు పాఠశాల రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాల ప్రాంగణంతో పాటు క్లాస్ రూంలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. డీఈఓ వెంట ఎంఈఓ జీవన్ కుమార్, స్ట్రాంగ్ టీచర్ రఘునాథ్‌రెడ్డి, సీఆర్టీ పత్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment