మదర్‌ డెయిరీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల | | Sakshi
Sakshi News home page

మదర్‌ డెయిరీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Published Tue, Aug 27 2024 2:48 AM | Last Updated on Tue, Aug 27 2024 2:48 AM

-

హయత్‌నగర్‌: హయత్‌నగర్‌లోని నల్లగొండ – రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సమాఖ్య(నార్మూల్‌ మదర్‌ డెయిరీ)లో డైరెక్టర్ల ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 30తో పదవీ కాలం ముగియనున్న మూడు స్థానాలు, గతంలో వాయిదా పడిన మరో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి వెంకట్‌రెడ్డి సోమవారం తెలిపారు. సెప్టెంబర్‌ 4న ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, 5న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నామినేషన్ల పరిశీలన, అర్హత సాధించిన నామినేషన్ల ప్రకటన, 6న ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత పోటీలో ఉన్నవారి పేర్లను ప్రకటిస్తామని, సెప్టెంబర్‌ 13న హయత్‌నగర్‌లోని ఎస్‌వీ కన్వెన్షన్‌ హాల్‌లో ఉదయం 8నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహిస్తామని, మరుసటి రోజు ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. అనంతరం పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్‌ను ఎన్నిక నిర్వహిస్తామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement