ఆటోను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు | | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు

Published Wed, Aug 28 2024 2:54 AM | Last Updated on Wed, Aug 28 2024 2:54 AM

-

చౌటుప్పల్‌ రూరల్‌: ఆగి ఉన్న ఆటోను కారు ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చౌటుప్పల్‌ మండలంలోని తుప్రాన్‌పేట గ్రామ సమీపంలో విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారి మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటోను డ్రైవర్‌ తుప్రాన్‌పేట గ్రామ సమీపంలోని ఆద్యా హోటల్‌ వద్ద రోడ్డు పక్కన నిలిపాడు. అదే దారిలో అతివేగంగా కారు వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యాదవరెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement