● మృతురాలిది సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం అందనాలపాడుకు చెందిన యువతి అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. అందనాలపాడు గ్రామానికి చెందిన కనకం మహేందర్‌కు సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడేనికి చెందిన మౌనిక(26)తో ఏప్రిల్ 4న వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.10లక్షల ఒప్పుకుని రూ.5లక్షల నగదు, ఐదు తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజుల అనంతరం అదనపు కట్నం కోసం భర్త మహేందర్, అత్త సత్యవతి, ఆడబిడ్డతో పాటు ఇతర కుటుంబ సభ్యులు మౌనికను వేధిస్తున్నారు. ఈ నెల 22న మౌనిక పుట్టిరోజు కాగా అత్తింటివారు రూ.30 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేశారు. అత్త సత్యవతి మాత్రలు మింగి చావమంటూ బీపీ మాత్రలు మౌనికపై విసిరింది. మనస్తాపానికి గురైన మౌనిక వాటిని తీసుకుని అధిక మోతాదులో మింగడంతో అపస్మాకర స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు మొదట ఖమ్మం తరలించి అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతిచెందింది. మృతురాలి తండ్రి నవిలె కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మౌనిక భర్త కనకం మహేందర్, అత్త సత్యవతి, ఆడబిడ్డ స్వప్న, ఆమె భర్త తిరుపతయ్య, బంధువు గోవిందు ఏసు, ఆయన భార్య జయమ్మపై కేసు నమోదు చేసినట్లు సీఐ బి. రాజేశ్ సోమవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment