రైతులకు ఇబ్బంది కలగొద్దు
నార్కట్‌పల్లి : రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ అనితా రామచంద్రన్ అన్నారు. మంగళవారం నార్కట్‌పల్లి మండలంలోని నెమ్మాని గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ధాన్యం రాశులను, తేమశాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిల్లులకు ధాన్యం తరలించడంతోపాటు.. ప్రభుత్వం ఆధ్వర్యంలో గోదాముల్లో నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల జాప్యం చేయొద్దన్నారు. ఆమె వెంట డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ఉమేష్, ఏపీఎం శ్రీదేవి ఉన్నారు.
పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ అనితారామచంద్రన్
Comments
Please login to add a commentAdd a comment