ప్రభుత్వ పాలసీకి మిల్లర్లు సహకరించాలి
నల్లగొండ : కష్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్), ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీకి మిల్లర్లు సహకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహన్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్‌లో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుందని.. మిల్లర్ల మిల్లింగ్ చార్జీలను నాలుగింతలు పెంచిందని తెలిపారు. 10 శాతం బ్యాంకు గ్యారంటీతో సీఎంఆర్ కేటాయిస్తామన్నారు. పెండింగ్లో ఉన్న మిల్లర్ల మిల్లింగ్ చార్జీలు, రవాణ చార్జీలను చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో 2.80 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు సన్నబియ్యాన్ని ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జిల్లాలో వానాకాలం 99 శాతం, యాసంగి 75 శాతం సీఎంఆర్ పూర్తి చేయడంపై అధికారులను అభినందించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరించాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లా రైస్ మిల్లర్లు రాష్ట్రానికే ఆదర్శంగా ఉన్నారని, అడిగిన వెంటనే ప్రభుత్వం విధించిన షరతులతో బ్యాంకు గ్యారంటీకి ఒప్పుకున్నారని తెలిపారు. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ 2024–25 వానకాలం ధాన్యం కొనుగోలుపై వివరాలు సమర్పించారు. సమావేశంలో డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, మేనేజర్ హరీష్, డీఏఓ శ్రవణ్, డీఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, ఎల్‌డీఎం శ్రామిక్, జిల్లా సహకార శాఖ అధికారి సత్యానాయక్, రైస్ మిల్లర్ల ప్రతినిధులు హాజరయ్యారు.
ఘనంగా నాగులచవితి
పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహన్
Comments
Please login to add a commentAdd a comment