నేడు మంత్రి కోమటిరెడ్డి రాక
నల్లగొండ: రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం నల్లగొండకు రానున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నల్లగొండ చేరుకుని కలెక్టరేట్‌లో జరిగే జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ (దిశ) సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం యాదగిరిగుట్టకు వెళ్లి మిషన్ భగీ రథ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. తిరిగి సాయంత్రం నల్లగొండకు చేరుకుని ప్రజా పాలన విజయోత్సవాల్లో పాల్గొంటారు.
డాటా ఎంట్రీ పక్కాగా చేపట్టాలి
త్రిపురారం: సమగ్ర కుటుంబ సర్వే వివరాల డాటాను పక్కాగా ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. గురువారం త్రిపురారం మండల కేంద్రంలోని రైతు వేదికలో సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లకు సర్వే వివరాల ఆన్‌లైన్ ఎంట్రీకి సంబంధించి చేపట్టిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆన్‌లైన్ డాటా ఎంట్రీ ప్రక్రియలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కార్యక్రమంలో త్రిపురారం ఎంపీడీఓ విజయకుమారి, ఏఎస్‌ఓ దీప, పీఆర్‌ఏఈ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాం
నల్లగొండ టౌన్: డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు రైతుల నుంచి లక్ష ఐదే వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం డీఎస్‌ఓ వెంకటేశ్వర్లుతో కలిసి నల్లగొండ పట్టణ పరిధిలోని ఎస్‌ఎల్‌బీసీలోని డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల ఖాతాల్లో రూ.200 కోట్లు జమచేసినట్లు తెలిపారు. వారివెంట డీసీఎంఎస్ మేనేజర్ నాగిళ్ల మురళి తదితరులు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు
సద్వినియెగం చేసుకోవాలి
త్రిపురారం : గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియెగం చేసుకోని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని జిల్లా ట్రైబల్ ఇన్‌చార్జ్, హౌసింగ్ పీడీరాజ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని మాటూర్ పరిధిలోని తండాల్లో గిరిజన సాధికారత వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా దిర్త ఆబ కార్యక్రమంపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పీడీ రాజ్‌కుమార్ మాట్లాడుతూ జన జాతీయ గ్రామ ఉత్కర్‌ష అభియాన్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియెగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో త్రిపురారం ఎంపీఓ సుదీర్ కుమార్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment