చెర్వుగట్టులో భక్తజన సందోహం
నార్కట్‌పల్లి : కార్తీక మాసం సందర్భంగా నార్కట్‌పల్లి మండల పరిధిలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో లడ్డూ ప్రసాదం కౌంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేశారు. టోల్‌గేట్ నిర్వాహకులు రుసుము తీసుకోని వాహనాలను గుట్టపైకి పంపడంతో గుట్టుపైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆలయ అధికారులు, పోలీసులు స్పందించి గుట్టపైన ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను గుట్టు పైకి అనుమతించలేదు. ఈ వేడుకల్లో ఈఓ నవీన్‌కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సీనియర్ అసిస్టెంట్లు ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, యాదయ్య, రాజ్యలక్ష్మి, వంశీ, అర్చకులు శ్రీకాంత్, సురేష్, సతీష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment