చిట్యాల: ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రతిపాదిస్తున్న ఒకే దేశం–ఒకే ఎన్నికల (జమిలీ ఎన్నికలు) విధానాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ కోరారు. చిట్యాలలో ఆదివారం జరిగిన డీవైఎఫ్‌ఐ నల్లగొండ జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. అంతకుముందు సంఘం జెండాను ఆయన ఎగురవేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, జిల్లా ఆఫీస్ బేరర్స్ వడ్డెగాని మహేష్, మహమ్మద్ అక్రం, జిట్ట రమేష్, కట్ట లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యులు పంది నరేష్, అవిశెట్టి కిరణ్, కార్తీక్, సీపీఎం నాయకులు అర్రూరి శ్రీను పాల్గొన్నారు.
నల్లబెల్లం పట్టివేత
చివ్వెంల(సూర్యాపేట) : నల్లబెల్లం, పటిక, నాటుసారాను అక్రమంగా తరలిస్తున్న డీసీఎంను ఎకై ్సజ్ అధికారులు ఆదివారం స్వాఽధీనం చేసుకున్నారు. ఎకై ్స జ్ సీఐ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు.. అసిస్టెంట్ కమిషర్ సంతోష్, సూర్యాపేట ఎకై ్సజ్ ఎస్‌పీ లక్ష్మానాయక్ ఆధ్వర్యంలో చివ్వెంల మండల పరిధిలోని లక్ష్మణ్‌నాయక్ తండా గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా డీసీఎంలో తరలిస్తున్న నల్లబెల్లం 2750 కిలోలు, పటిక 40 కిలోలు, నాటుసారా 10 లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న నాగయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు వ్యక్తులు లునావత్ వెంకన్న, ఉపేందర్, వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రాకేష్, ఎస్‌ఐలు సురేందర్ బెనర్జీ, గోపాల్‌రావు, శోభారాణి, కానిస్టేబుళ్లు అప్సర్, అయూబ్, గఫూర్, క్రాంతి పాల్గొన్నారు.
మిర్యాలగూడ : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 50 సంవత్సరాల తరువాత ఆదివారం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 1973–75 విద్యా సంవత్సరానికి చెందిన ఇంటర్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు సుమారు 50 మంది కళాశాలకు చేరుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని అలనాటి జ్ఞాపకాలను గుర్తువేసుకున్నారు. కార్యక్రమంలో ఎడ్ల కన్నయ్య, జొన్నలగడ్డ లక్ష్మారెడ్డి, డి.మోహన్, కె.హేమసుందర్‌గుప్తా, రాఘవరెడ్డి, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment